యూటిఎఫ్‌పై నిరాధార ఆరోపణలు తగవు: యుటిఎఫ్ నాయకులు
గంగవరం, పెన్ పవర్ ,ఏప్రిల్ 9: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటిఎఫ్)పై చేస్తున్న నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నామని యూటిఎఫ్ మండల అధ్యక్షుడు బొజ్జి దొర, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి తెలిపారు. రంపచోడవరం లో ఏప్రిల్ 12న నిర్వహించనున్న గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల 6వ రాష్ట్ర సదస్సు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం గంగవరం లో జరిగింది. ఈ కార్యక్రమానికి కారం బొజ్జిదొర అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, యూటిఎఫ్ స్థాపన నుంచి ఇప్పటి వరకు కుల, మత, వర్గ, ప్రాంత భేదాలకు...