రంపచోడవరం కేంద్రంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ డిమాండ్ గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, ఏప్రిల్ 10: పోలవరం జిల్లా రంపచోడవరం మేజర్ పంచాయతీ కేంద్రంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తక్షణమే శాశ్వత డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలో ప్రతిరోజూ టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోతున్నప్పటికీ, దానిని శాస్త్రీయంగా తరలించేందుకు లేదా నిల్వ చేయేందుకు సరైన వేదిక లేకపోవడం ఆందోళనకరమని తెలిపారు. ప్రస్తుతం చెత్తను నివాస ప్రాంతాల సమీపంలో లేదా రహదారుల...