రంపచోడవరం నూతన డీఎస్పీగా అషరఫ్ అలీ నియామకం

  గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, ఏప్రిల్ 11: పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్‌కు నూతన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా అషరఫ్ అలీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 2023 బ్యాచ్‌కు చెందిన ఈ యువ పోలీసు అధికారి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి పోలీసు విభాగంలోకి ప్రవేశించారు. కడప జిల్లాకు చెందిన అషరఫ్ అలీని రంపచోడవరం డీఎస్పీగా నియమిస్తూ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ...