రింతాడ పంచాయితీ అభివృద్ధికి సమన్వయంతో ముందుకు వెళ్ళాలి
ప్రత్యేక అధికారిని సన్మానించిన జనసేన నాయకులు గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 20:రింతాడ పంచాయితీకి నూతనంగా నియమితులైన స్పెషల్ ఆఫీసర్, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ కళ్యాణ్‌రావును సోమవారం జనసేన పార్టీ నాయకులు ఘనంగా కలుసుకున్నారు. జీకే వీధి మండల అధ్యక్షుడు కొయ్యం బాలరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆయనకు దూసాలువతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పంచాయితీ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారంలో సమన్వయంతో పనిచేయాలని కోరారు. రింతాడ పంచాయితీ పరిధిలోని పలు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తీసుకువెళ్లారు....