రెవెన్యూ సేవల్లో పారదర్శకతే ప్రభుత్వ లక్ష్యం
ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి గంగవరం/ రాజవొమ్మంగి పెన్ పవర్, ఏప్రిల్ 4: రైతుల భూ-ఆస్తుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్ మిరియాల శిరీషాదేవి పేర్కొన్నారు. శనివారం రాజవొమ్మంగి మండలం పాకవెల్తి గ్రామంలో నిర్వహించిన “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, గత ప్రభుత్వ కాలంలో పట్టాదారు పాసుపుస్తకాలపై వ్యక్తిగత ఫోటోలు ముద్రించడం అనుచితమని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రైతుల...