రేల చెట్టుకి పులెక్కువ…మామిడి చెట్టుకు ఆకులు తక్కువ…!!! 

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 29:సహజంగా మామిడి చెట్టు ఆకులతో నిండి గుబురుగా కనిపిస్తుంది. అయితే అందుకు భిన్నంగా జీకేవీధి మండలం కంపుమానుపాకలు గ్రామంలో భూపతి అనే యువ రైతు వ్యవసాయ భూమిలో మామిడి చెట్టు కొమ్మలకు తక్కువ ఆకులు కనిపిస్తున్నాయి. అదే ప్రాంతంలో రేలచెట్టు పచ్చని పూలతో నిండి అలరిస్తోంది.