రోడ్డు నిబంధనలు పాటించండి.. సురక్షితంగా గమ్యాన్ని చేరండి:జీకే వీధి ఎస్ఐ సురేష్
గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 20:రహదారి భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని జీకేవీధి ఎస్సై సురేష్ సూచించారు. గూడెం కొత్తవీధి మండలం ఆర్వీనగర్ వారపు సంతలో సోమవారం గిరిజనులతో కలిసి రోడ్డు ప్రమాదాలు, మహిళలపై దాడుల నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా పాల్గొన్న వారు “రోడ్డు నిబంధనలు పాటించండి – సురక్షితంగా గమ్యానికి చేరండి”, “ప్రమాదాలకు గురై కుటుంబాల్లో విషాదం నింపొద్దు”, “మీ కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులను గుర్తుంచుకుని జాగ్రత్తగా ప్రయాణం చేయండి”, “మహిళలు, బాలికలపై దాడులను...