రోడ్డు ప్రమాదం ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 20: చిలకలూరిపేట: పట్టణంలోని ఒంగోలు బ్రిడ్జి సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందారు. ఉదయం సుమారు 6 గంటల సమయంలో వేగంగా వచ్చిన ట్రాక్టర్ నియంత్రణ తప్పి పాదచారిని బలంగా ఢీకొట్టడంతో, సదరు వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, మృతుని వివరాల కోసం దర్యాప్తు...