వంచుల తాజా మాజీ సర్పంచ్ దంపతులను ఘన సన్మానం  

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 7:మండలంలోని వంచుల పంచాయతీ చెరపల్లి గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ వనపల కాసులమ్మ, ఆమె భర్త వైసీపీ నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షుడు రాజేష్ దంపతులను వైసీపీ శ్రేణులు, శ్రేయోభిలాషులు ఘనంగా సన్మానించారు. మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో దంపతులకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కాసులమ్మ మాట్లాడుతూ సర్పంచ్‌గా తన ఐదేళ్ల పదవీకాలంలో తనకు అండదండలు అందించిన స్నేహితులు, శ్రేయోభిలాషులు, వైసీపీ నాయకులు, వార్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో...