వడగాలుల నేపథ్యంలో ముందస్తు చర్యలపై అవగాహన – ఎంపీడీఓ సూచనలు

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 18: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాలుల ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని విపత్తుల నిర్వహణలో భాగంగా సీపీఆర్ మరియు ఇతర అత్యవసర చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మండల పరిధిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ బిహెచ్వి రమణ బాబు  మాట్లాడుతూ వడగాలులు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ప్రజలు అవసరం లేకుండా మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని, తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలని తెలిపారు. వృద్ధులు, చిన్నపిల్లలు,...