వడగాల్పుల హెచ్చరిక – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
గంగవరం, ఏప్రిల్ 4 (పెన్ పవర్): విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసిన హెచ్చరికల ప్రకారం, ఈ రోజు మండలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని గంగవరం తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో బయటకు వెళ్లడం నివారించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తలకు టోపీ ధరించడం లేదా రుమాలు కట్టుకోవడం, గొడుగు వినియోగించడం తప్పనిసరి...