విద్యుత్ ఘాతకానికి నాలుగు ఇల్లు దగ్ధం..
[video width="478" height="850" mp4="https://penpower.in/wp-content/uploads/2026/04/VID-20260405-WA0061.mp4"][/video] అడ్డతీగల, పెన్ పవర్, ఏప్రియల్ 05;అడ్డతీగల మండలం కొనలోవ గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా, సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో నాలుగు ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈస్టర్ పండుగ కావడంతో బాధితులందరూ గ్రామ సమీపంలో సామూహిక వంటలు చేసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పినప్పటికీ, నిత్యావసరాలు, సామాగ్రి కాలి బూడిదయ్యాయి. స్థానికులు మంటలను ఆర్పేందుకు శ్రమించగా, రంపచోడవరం ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు....