శలపాక రోడ్డులోని ఇండియన్ ఆయిల్ విజయ ఫిల్లింగ్ స్టేషన్ తొలి వార్షికోత్సవం

వ్యాపార అభివృద్ధితో ముందుకు – తాడి రామారెడ్డి కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 30: కాజులూరు మండల పరిధిలోని సలపాక రోడ్డులో ఉన్న ఇండియన్ ఆయిల్ విజయ ఫిల్లింగ్ స్టేషన్ (పెట్రోల్ బంకు) విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బంకు యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త మరియు శలపాక సాగునీటి సంఘం అధ్యక్షుడు తాడి రామారెడ్డి (టీఎంఆర్) కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “గత ఏడాది కాలంగా మా బంకుపై నమ్మకం ఉంచి, మమ్మల్ని ఆదరించిన ప్రతి...