సంకాడ పంచాయతీలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 14 :సంకాడ పంచాయతీలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ జేఈఈ,పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ కళ్యాణ్, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు దేశగిరి గోవిందరావు, జనసేన నాయకుడు ఊలం ఈశ్వరరావు తదితరులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం దేశగిరి గోవిందరావు మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా, ప్రముఖ సంఘ సంస్కర్తగా, ఆర్థికవేత్తగా, న్యాయవాదిగా దేశానికి విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. దళిత వర్గాల...