సంక్షోభాలను సంకల్పాలుగా మార్చుకున్న నాయకుడు చంద్రబాబు

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 20:సంక్షోభాలను సంకల్పాలుగా మార్చుకుంటూ ముందుకు సాగే దిశాలోచన గల నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వి.వి. ప్రసాద్ అన్నారు. జీకే వీధి మండలం రింతాడలో నిర్వహించిన చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ, కొందరు చరిత్రను చదువుతారని, మరికొందరు చరిత్రను రాస్తారని, అయితే చంద్రబాబు నాయుడు చరిత్రను సృష్టించే నాయకుడని అన్నారు. ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా,...