సమస్యల పరిష్కారానికి మండల కేంద్రంలో సోమవారం ‘మీ కోసం’ కార్యక్రమం
గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 12:జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గూడెం కొత్త వీధి మండలంలో ప్రజల అర్జీల స్వీకరణ కోసం సోమవారం మండల కేంద్రంలో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తహసీల్దార్ హెచ్.అన్నాజీ రావు తెలిపారు. మండలానికి చెందిన ప్రజలు తమ సమస్యలు, వినతిపత్రాలను ఈ కార్యక్రమంలో నేరుగా సమర్పించవచ్చని సూచించారు. పాడేరు కేంద్రానికి వెళ్లి వ్యయప్రయాసలు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమం సందర్భంగా అన్ని శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై...