సాగు నీటి సంఘాల బాధ్యత”పై అవగాహన సదస్సు
కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 6: “నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత” అనే అంశంపై 100 రోజుల ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా కాజులూరు మండల కార్యాలయ మీటింగ్ హాల్‌లో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి జె. రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాలను పెంపొందించడం, నీటి వినియోగంలో పొదుపు పాటించడం,నీటి భద్రతను కాపాడడంలో సాగు నీటి సంఘాల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న నీటిని...