సిమెంట్ లారీ బోల్తా…తప్పిన పెను ప్రమాదం..!
పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 12 పుల్లలచెరువు మండలం మురికిమళ్ల గ్రామ సమీపంలోని జాతీయ రహదారి–565పై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. గిద్దలూరు వైపు సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ అధిక వేగంతో అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి పల్టీలు కొట్టి బోల్తా పడింది.ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు, లారీ వేగం నియంత్రణలో లేకపోవడంతో ఒక్కసారిగా డ్రైవర్ అదుపు కోల్పోయాడు. దీంతో వాహనం రోడ్డును దాటి పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో లారీలో...