సైస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో యువతకు ఉపాధి
జాబ్ మేళాలో 60 మందికి ఉద్యోగాలు కాకినాడ, పెన్ పవర్, ఏప్రిల్ 9: కాకినాడ భానుగుడి సెంటర్‌లోని సైస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో మొత్తం 60 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు సంస్థ డైరెక్టర్ జంగం బాబ్జీ తెలిపారు. యువత కు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ జాబ్ మేళాను నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ పొందిన అభ్యర్థులకు నేరుగా కంపెనీలలో ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని...