స్వర్ణ లక్కొండ లో అభివృద్ధి పనులపై ఆకస్మిక తనిఖీలు

గంగవరం, పెన్ పవర్, ఏప్రిల్ 7: మండలంలోని స్వర్ణ లక్కొండ గ్రామంలో డిప్యూటీ ఎంపీడీవో గోపన్న దొర ఆకస్మికంగా పర్యటించి సిబ్బంది పనితీరు, రికార్డులను పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు.ప్రస్తుత వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా పైపులైన్ లీకేజీలు, ట్యాంక్ లీకేజీలను వెంటనే గుర్తించి మరమ్మతులు చేయాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లకు ఆదేశించారు. అలాగే సచివాలయ భవన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన ఆయన,...