స్వీయ గణనపై ఉపాధి వేతనదారులకు అవగాహన

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్‌ 20: స్వీయ గణన పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జీకే వీధి తహశీల్దార్ అన్నాజీరావు సూచించారు. మండలంలోని రింతాడ పంచాయతీ ముల్లుమెట్ట గ్రామంలో సోమవారం ఉపాధి హామీ వేతనదారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు స్వీయ గణన కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. జనగణన వెబ్‌పోర్టల్‌ ద్వారా ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే విధానంపై వివరణ ఇచ్చారు.ఈ విధానం ద్వారా జనగణన...