పవిత్ర గోదావరి తీరంలో శ్రీ పళ్ళాలమ్మ జాతర శోభ –

గోడపత్రికతో ఉత్సవాలకు నాంది కొత్తపేట, పెన్ పవర్, ఏప్రిల్26: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో వెలసిన శ్రీ పల్లాలమ్మ అమ్మవారి తీర్థ కల్యాణ మహోత్సవాలు నెలరోజులపాటు జరగనున్న సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తీర్థ మహోత్సవ గోడపత్రికను ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మద్దింశెట్టి ఆదినారాయణ,ట్రస్ట్ బోర్డు సభ్యులు,ఆలయ కార్యనిర్వాహణాధికారి భాగవతుల వెంకటరమణమూర్తి,గ్రామ పెద్దలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ మే 3న (ఆదివారం) చిన్న జాగారం,మే 4న(సోమవారం )పెద్ద...