హర్మూజ్‌ను తెరవడానికి 35 దేశాలు ప్రయత్నాలు..
హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి యూకే నేతృత్వంలో 35 దేశాలు దౌత్య చర్చలు ముమ్మరం చేశాయి. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన ఈ మార్గంపై భారత్‌కు కూడా అధికారిక ఆహ్వానం అందింది. భారత్ తరఫున విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి వర్చువల్‌గా సమావేశంలో పాల్గొన్నారు. ఇంధన నౌకల సురక్షిత రాకపోకల కోసం ఇరాన్ సహా సంబంధిత దేశాలతో ఢిల్లీ సంప్రదింపులు కొనసాగిస్తోంది. భారత్ ఇంధన భద్రత దృష్ట్యా ఈ చర్చలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. హర్మూజ్ కోసం యూకే నేతృత్వంలో 35 దేశాల సమావేశం...