మహిళల భద్రతపై పోస్టర్లతో అవగాహన ప్రచారం
గంగవరం, పెన్ పవర్, ఏప్రిల్ 19: మహిళల భద్రత పట్ల సమాజంలో అవగాహన పెంపొందించేందుకు గంగవరం పోలీసులు పోస్టర్ల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టారు. ప్రతి ఒక్కరూ సత్సంకల్పంతో ప్రవర్తిస్తూ మహిళల రక్షణకు తోడ్పడాలని గంగవరం ఎస్సై ఎస్. వెంకయ్య సూచించారు. ఆదివారం ఎస్సై వెంకయ్య ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. జిల్లా ఎస్పీ అమిత్ బర్ధన్ ఆదేశాల మేరకు అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహమూర్తి పర్యవేక్షణలో గంగవరం పోలీసులు ఈ ప్రచారాన్ని చేపట్టారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో, వ్యాపార కేంద్రాల్లో...