కఠిన వ్యాపార వాతావరణానికి సిద్ధంగా ఉండండి

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో మరింత కఠిన వ్యాపార పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ హెచ్చరించారు.30 మందికి పైగా గ్రూప్ సీఈఓలు, ఎండీలతో జరిగిన సమీక్షలో సరఫరా అంతరాయాలు, పెరుగుతున్న ఖర్చులపై చర్చించారు.డిమాండ్ మందగింపు, ప్రాజెక్టుల ఆలస్యం, లాజిస్టిక్స్ ఖర్చుల పెరుగుదలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.నగదు నిర్వహణ, ఖర్చుల నియంత్రణ, ప్రాజెక్ట్ టైమ్‌లైన్‌ల పునఃసమీక్షపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పారు.పశ్చిమాసియాలో ఉన్న 10 వేలకుపైగా టాటా ఉద్యోగుల భద్రత, తిరిగి రప్పింపు చర్యలు కూడా సమావేశంలో ప్రధాన అంశమయ్యాయి....