ఏపీ రాజకీయాల్లో కుల సమీకరణాల హీట్..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సామాజిక వర్గాల ప్రభావం రోజురోజుకూ మరింత బలపడుతోంది. ఒకప్పుడు పార్టీ అంతర్గత లెక్కలకే పరిమితమైన కుల సమీకరణాలు ఇప్పుడు బహిరంగ చర్చలకు వస్తున్నాయి.ప్రతి వర్గం తమకు తగిన ప్రాతినిధ్యం, టికెట్లు, అధికారంలో వాటా కావాలని బలంగా డిమాండ్ చేస్తోంది.నియోజకవర్గాల పునర్విభజన అవకాశాలు ఈ ఒత్తిడిని మరింత పెంచుతున్నాయి.రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక పార్టీలకు అతిపెద్ద సవాల్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతి జిల్లాలో సామాజిక వర్గాల కొత్త డిమాండ్లు పునర్విభజనతో పెరిగిన రాజకీయ ఆశలు టికెట్లలో సమతుల్యతే పార్టీలకు అసలు పరీక్ష...