జగ్గంపేట ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్
జగ్గంపేట గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారిగా జగ్గంపేట ఎంపీడీవో ఏవీఎస్ చంద్రశేఖర్ శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పంచాయతీ కార్యదర్శి జి.శివ పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట డిప్యూటీ ఎంపీడీవో, పంచాయతీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.