మద్యం మత్తులో కారు బీభత్సం

చిన్నారికి గాయాలు, మధురవాడలో ఉద్రిక్తత మధురవాడ, పెన్ పవర్ ఏప్రిల్ 06: నగరంలోని మధురవాడ పరిధిలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఓ యువకుడు కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. వైఎస్సార్ కాలనీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనకు గురిచేసింది. ఐటీ సెజ్ రోడ్డుపై నుంచి వేగంగా వచ్చిన కారు, నియంత్రణ కోల్పోయి అడ్డదిడ్డంగా దూసుకెళ్లింది. ఈ క్రమంలో రోడ్డుపక్కన పార్క్ చేసి ఉన్న పలు వాహనాలను ఢీకొట్టింది. ఘటనలో ఒక చిన్నారి గాయపడగా, వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనను...