అడ్డూ, అదుపు లేకుండా ఫీజులు
కొత్త విద్యా సంవత్సరం దగ్గరపడుతుండగా ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల భారం తల్లిదండ్రుల్లో కొత్త ఆందోళన రేపుతోంది. ప్రతి ఏడాది 20 నుంచి 30 శాతం వరకు ఫీజులు పెంచుతున్నా విద్యాశాఖ కట్టడి చేయడంలో విఫలమవుతోందన్న విమర్శలు పెరుగుతున్నాయి.ఫీజుల నియంత్రణకు డ్రాఫ్ట్ బిల్లు సిద్ధమైనప్పటికీ ఇంకా స్పష్టమైన చట్టం రాకపోవడం ప్రశ్నలు లేవనెత్తుతోంది.మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై ఈ భారం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని సృష్టిస్తోంది.ఇప్పటికైనా ప్రత్యేక చట్టంతో ఫీజుల దోపిడీకి కళ్లెం వేయాలన్న డిమాండ్ బలపడుతోంది. కొత్త విద్యాసంవత్సరం ముందే ఫీజుల షాక్...