అగ్రరాజ్యానికి ఆయుధమే ఆహారం..
ప్రపంచానికి శాంతి, ప్రజాస్వామ్యం పేరుతో ఉపన్యాసాలు ఇస్తూనే, మరోవైపు యుద్ధాలను లాభాల మార్కెట్‌గా మలుచుకుని ఆయుధాల అమ్మకాలతో ఆర్థిక ఆధిపత్యాన్ని కాపాడుకోవడం అమెరికా అసలు వ్యూహమనే విమర్శలు అంతర్జాతీయ వేదికలపై మరింత బలపడుతున్నాయి. ఒక దేశంలో చిచ్చు రాజేస్తే మరో ఖండంలో తన స్టాక్ మార్కెట్ ఎగిసేలా ‘ప్రాక్సీ వార్’లను పెట్టుబడిగా మార్చుకున్న అగ్రరాజ్యం, మానవత్వం కంటే మిలిటరీ వ్యాపారానికే పెద్దపీట వేస్తోందన్న భావన ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. శాంతి నినాదం వెనుక యుద్ధ వ్యాపార రాజకీయాలు ప్రాక్సీ వార్లతో లాభాల పంట కోస్తున్న అగ్రరాజ్యం...