పవర్ కారిడార్ నుంచి జైలు గోడల వరకూ.. కళింగిరి శాంతి
దేవాదాయ శాఖలో ఒకప్పుడు అత్యంత ప్రభావశీల అధికారిగా పేరొందిన కళింగిరి శాంతి ప్రస్థానానికి ఏసీబీ భారీ షాక్ ఇచ్చింది.ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఆమెను కోర్టు 14 రోజుల రిమాండ్‌కు పంపింది. కొద్ది ఏళ్ల సర్వీసులోనే అధికార దర్పం, వివాదాలు, రాజకీయ అండతో వార్తల్లో నిలిచిన ఆమె.. ఇప్పుడు అవినీతి ఆరోపణలతో జైలు ఊచలు లెక్కిస్తోంది.ఈ ఘటన దేవాదాయ శాఖలో పారదర్శకత, బాధ్యతపై మరోసారి పెద్ద చర్చకు దారితీసింది.రాజకీయ అండ, అధికారం, అవినీతి కలిస్తే వ్యవస్థలు ఎలా దెబ్బతింటాయో ఈ ఉదంతం...