పునర్నిర్మాణానికి నడుం బిగించండి
అమెరికా–ఇజ్రాయిల్ దాడులతో దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు దేశం మొత్తం నడుం బిగించాలని ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ పిలుపునిచ్చారు. జాతీయ ప్రకృతి దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రజలకు సూచించారు.యుద్ధం 34వ రోజుకు చేరుకున్న వేళ టెహ్రాన్ సహా పలు ప్రాంతాల్లో పునర్నిర్మాణ పనులకు వేగం పెంచాలని స్పష్టం చేశారు. అమెరికా ఏ భూతల దాడినైనా ఎదుర్కొనేందుకు 7 మిలియన్ల ఇరానీయులు సిద్ధంగా ఉన్నారని పార్లమెంట్ స్పీకర్ ప్రకటించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి....