చిత్తూరు-తచ్చూరు మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే
చిత్తూరు నుంచి తమిళనాడులోని తచ్చూరు వరకు ఆరు లైన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే అందుబాటులోకి రావడానికి సిద్ధమైంది. 116 కిలోమీటర్ల ఈ హైవేపై అధికారులు విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు.దీనిలో 95 కిలోమీటర్లు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉండటం స్థానికంగా ప్రాధాన్యం సంతరించుకుంది.బెంగళూరు–చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేతో అనుసంధానం కావడంతో పోర్టులకు సరుకు రవాణా వేగవంతం కానుంది.త్వరలో పూర్తిస్థాయిలో వాహనాలకు అనుమతి ఇచ్చి టోల్ వసూళ్లు ప్రారంభించనున్నారు. చిత్తూరు నుంచి తచ్చూరు వరకు 116 కి.మీ ఆరు లైన్ల హైవే 95 కి.మీ మార్గం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే...