వికేంద్రీకరణే జగన్ లక్ష్యం
అమరావతి చట్టబద్ధతపై కేంద్రం ముందుకు వచ్చినా, ప్రాంతీయ సమతుల అభివృద్ధే వైసీపీ ప్రధాన వాదనగా నిలుస్తోంది. మాజీ సీఎం జగన్ దృష్టిలో రాజధాని అంటే కేవలం ఒక నగరం కాదు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దారి తీసే పాలనా నిర్మాణం. మూడు రాజధానుల ఆలోచన వెనుక ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి లక్ష్యముందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అమరావతిపై పెట్టుబడి భారాన్ని తగ్గిస్తూ పరిపాలనను ప్రజలకు దగ్గర చేయడమే అసలు ఉద్దేశమని వివరిస్తున్నారు. రాజకీయంగా కాకుండా దీర్ఘకాల పరిపాలనా దృష్టితోనే జగన్ వ్యాఖ్యలను చూడాలనే అభిప్రాయం...