అవినీతి ఆరోపణలతో మదనపల్లె తహసీల్దార్ అటాచ్

మదనపల్లె , పెన్ పవర్ ఏప్రిల్ 6: మదనపల్లె లో పనిచేస్తున్న తహసీల్దార్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో జిల్లా పరిపాలన కీలక నిర్ణయం తీసుకుంది. తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డిని కలెక్టరేట్‌కు అటాచ్ చేస్తూ కలెక్టర్ నిశాంత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటికే తహసీల్దార్‌పై స్థానిక ప్రజాప్రతినిధి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. డీకేటి భూములు, చుక్కల భూములు, మిలిటరీ భూములను వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసినట్లు ఆరోపణలు వినిపించాయి. ఈ ఫిర్యాదుపై పది రోజుల కిందటే జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ...