కబ్జా కోరల్లో చెరువులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో చెరువులు, కుంటలు, నాళాలు భారీగా కబ్జాలకు గురవుతుండటంతో వర్షాకాల ముంపు ముప్పు మళ్లీ పొంచి ఉంది. నాలుగు వేలకు పైగా నీటి వనరుల్లో వెయ్యికి పైగా అధిక విస్తీర్ణంలో ఆక్రమణలకు గురయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.FTL, బఫర్ జోన్‌లలో నిర్మాణాలు పెరగడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గి వరద ముప్పు పెరుగుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గత ఏడాది భారీ వర్షాల్లో వరంగల్ నగరం జలదిగ్బంధంలో చిక్కుకున్న ఘటనలు ఇంకా మరిచిపోలేదు.ఇప్పటికైనా ప్రత్యేక యంత్రాంగంతో చెరువుల రక్షణకు చర్యలు తీసుకోవాలని...