పెట్రో పరిశ్రమలకు ఊరట.. కీలక ముడిసరుకులపై కస్టమ్స్ సుంకం రద్దు
పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో పెట్రోకెమికల్ రంగంపై పెరిగిన ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 40 కీలక పెట్రోకెమికల్ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాన్ని జూన్ 30 వరకు పూర్తిగా మినహాయించింది. దీంతో ప్లాస్టిక్స్, ఫార్మా, టెక్స్‌టైల్స్, ఆటో కంపోనెంట్స్ రంగాలకు తక్షణ ఉపశమనం లభించనుంది. మిథనాల్ నుంచి PVC, PET చిప్స్ వరకు విస్తృత జాబితా ఈ మినహాయింపులో ఉంది. ముడిసరుకు ఖర్చులు తగ్గడంతో వినియోగదారులపై ధరల భారం కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. జూన్ 30 వరకు సుంక మినహాయింపు...