జ్యుడీషియల్ అధికారుల నిర్బంధంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ విధుల్లో ఉన్న ఏడుగురు జ్యుడీషియల్ అధికారులను నిర్బంధించడం సుప్రీంకోర్టును తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. మాల్దా జిల్లాలో జరిగిన ఈ ఘటనను న్యాయవ్యవస్థను భయపెట్టే ప్రయత్నంగా కోర్టు అభివర్ణించింది.CBI లేదా NIAతో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.అధికారుల భద్రత కోసం కేంద్ర బలగాలను మోహరించాలని కూడా స్పష్టం చేసింది.ఎన్నికల వేళ ఈ ఘటన బెంగాల్ రాజకీయాల్లో మరింత ఉద్రిక్తతకు దారితీసింది. మాల్దాలో జ్యుడీషియల్ అధికారుల నిర్బంధం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం, షోకాజ్ నోటీసులు...