కర్నూలుకే ఆ మూడు కీలక కార్యాలయాలు.. హైకోర్టు కీలక తీర్పు
కర్నూలు పరిపాలనా ప్రాధాన్యానికి మరోసారి బలం చేకూరింది.వక్ఫ్ ట్రైబ్యునల్‌ను అమరావతికి తరలించాలని దాఖలైన పిల్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.అదే సమయంలో లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను కూడా కర్నూలులోనే కొనసాగిస్తామని ప్రభుత్వం కోర్టుకు స్పష్టం చేసింది. దీంతో మూడు ప్రధాన సంస్థల కార్యాలయాలు కర్నూలులోనే కొనసాగనున్నట్లు స్పష్టత వచ్చింది.రాయలసీమ పరిపాలనా ప్రాధాన్యంపై ఈ నిర్ణయం కొత్త చర్చకు దారితీసింది. వక్ఫ్ ట్రైబ్యునల్‌పై హైకోర్టు స్పష్టమైన తీర్పు కేసుల భారం కర్నూలుకే అనుకూలం లోకాయుక్త, హెచ్‌ఆర్సీపై ప్రభుత్వ హామీ రాయలసీమకు పరిపాలనా బలం పెరిగినట్లే...