పిడుగుపాటుకు ఇద్దరు మృతి..
నలుగురికి తీవ్ర గాయాలు పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 6 మండలంలో సోమవారం చోటుచేసుకున్న పిడుగుపాటు ఘటనలు రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ దుర్ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అకాల వర్షాలతో కూడిన ఉరుములు, మెరుపులు ఒక్కసారిగా విరుచుకుపడటంతో ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పొలం పనుల నుంచి వస్తూ ప్రాణాలు కోల్పోయిన రైతు : మండలంలోని ఎండ్రపల్లి గ్రామంలో మురారిపల్లెకు చెందిన బొందలపాటి చిన్న చెన్నయ్య కుమారుడు నాగయ్య సోమవారం పొలం పనులు ముగించుకుని...