అయోమయంలో వైసీపీ.. చిక్కుల్లో జగన్!
లోక్‌సభలో అమరావతికి ఏకైక రాజధానిగా చట్టబద్ధత దక్కిన కీలక సమయంలో, ‘మావిగన్’ అనే కొత్త గ్రోత్ కారిడార్ ప్రతిపాదనను ముందుకు తేవడం ద్వారా వైసీపీ మరోసారి రాజధాని అంశంలో వ్యూహాత్మక అయోమయాన్ని సృష్టించిందన్న విమర్శలు బలపడుతున్నాయి. ఒకవైపు అమరావతికి వ్యతిరేకం కాదని చెబుతూ, మరోవైపు పార్లమెంట్‌లో బిల్లును వ్యతిరేకించి వాకౌట్ చేయడం, ఇప్పుడు కొత్త రాజధాని సిద్ధాంతాన్ని తెరపైకి తేవడం వల్ల జగన్ రాజకీయ విశ్వసనీయతతో పాటు పార్టీ క్యాడర్‌లోనూ గందరగోళం మరింత పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమరావతి బిల్లుతో వైసీపీ వ్యూహం తలకిందులా?...