Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుకొత్తపల్లి ఘాట్‌లో తప్పిన భారీ ప్రమాదం.. రెండు గంటలు నిలిచిన రాకపోకలు

కొత్తపల్లి ఘాట్‌లో తప్పిన భారీ ప్రమాదం.. రెండు గంటలు నిలిచిన రాకపోకలు

గూడెం కొత్త వీధి, పెన్అ పవర్,మే 11:అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం కొత్తపల్లి ఘాట్ రోడ్డులో సోమవారం భారీ ప్రమాదం తృటిలో తప్పింది. రహదారి నిర్మాణ పనుల కోసం కంకర తీసుకెళ్తున్న టిప్పర్ లారీ అదుపుతప్పి ఘాట్ రోడ్డు రక్షణ గోడ అంచువరకు వెళ్లి ఆగిపోయింది.జీకే వీధి మండలం ఆర్వీ నగర్–పాలగడ్డ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో నర్సీపట్నం నుంచి కంకరతో వస్తున్న లారీ, వర్షం కారణంగా బురదగా మారిన రోడ్డు అంచుల్లో జారిపోయింది. లారీ లోయ వైపు వెళ్లే పరిస్థితి ఏర్పడినా, రక్షణ గోడ వద్దే ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ప్రమాదం కారణంగా ఈ మార్గంలో సుమారు రెండు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular