అత్యంత వెనుకబడిన గిరిజన కుటుంబాల గృహ సర్వేకు కలెక్టర్ ఆదేశాలు

  గంగవరం /రంపచోడవరం ,పెన్ పవర్, మే 4: పోలవరం జిల్లాలో అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాలకు చెందిన కుటుంబాల గృహ సర్వేను సమగ్రంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ ఆదేశించారు.సోమవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో వైద్య ఆరోగ్య, స్త్రీ శిశు సంక్షేమ, గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులకు నిర్దిష్ట లక్ష్యాలను వివరించారు. ప్రతి కుటుంబాన్ని గుర్తించి, వివరాలను ఖచ్చితంగా నమోదు చేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.జిల్లా వైద్య...