అధికారుల పనితీరుపై రాష్ట్ర ఎస్.టి. కమిషన్ చైర్మన్ ఆగ్రహం
ప్రోటోకాల్ లోపాలపై పోలవరం జిల్లా సమీక్ష సమావేశం వాయిదా రంపచోడవరం, పెన్ పవర్, మే 31 : పోలవరం జిల్లాలో నిర్వహించాల్సిన రాష్ట్ర షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎస్.టి.) కమిషన్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం ప్రోటోకాల్ లోపాలు, అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా వాయిదా పడింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్.టి. కమిషన్ చైర్మన్ బొజ్జి రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.శనివారం నిర్వహించాల్సిన సమీక్ష సమావేశానికి సంబంధించి ముందుగానే షెడ్యూల్, సమాచారం సంబంధిత శాఖల అధికారులకు అందజేసినప్పటికీ, జిల్లా స్థాయి అధికారులు, ప్రోటోకాల్...