అభివృద్ధి బాటలో చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
పట్టణ ఆధునీకరణలో ప్రధమ స్థానం... మాజీ చైర్మన్ రఫాని చిలకలూరిపేట , పెన్ పవర్, మే 13 : చిలకలూరిపేట: పట్టణం ఎప్పుడూ కళకళలాడుతూ ఉండే ప్రాంతం. అయితే, పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల అవసరం ఎంతో ఉందని గుర్తించిన మాజీ మంత్రివర్యులు మరియు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆ లక్ష్యం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారని మాజీ మున్సిపల్ చైర్మన్ రఫాని అన్నారు. చిలకలూరిపేటలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని ప్రధాన సమస్యలైన రోడ్లు మరియు డ్రైన్ల వ్యవస్థను ఆధునీకరించడానికి...