అల్లూరి జిల్లా పదో తరగతి టాపర్ గా దేవి
పదవ తరగతిలో 593/600 మార్కులు. జోలపుట్టు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని. ముంచంగిపుట్టు, పెన్ పవర్, ఏప్రిల్ 30:ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా టాపర్ గా పరంబుడి దేవి నిలిచారు. ముంచంగిపుట్టు మండలం, జోలపుట్టు జెడ్పి ఉన్నత పాఠశాలలో చదివిన దేవి 593/600 మార్కులతో జిల్లా టాపర్ గా నిలిచింది. ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతమైన ఒనకఢిల్లీకి చెందిన దేవి, తల్లి ఓ ప్రైవేట్ పాఠశాల టీచర్ గా, తండ్రి మచ్కండ్ ప్రాజెక్టులో సెక్యూరిటీ గార్డ్ గా...