అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు..!
పుల్లల చెరువు పెన్ పవర్ మే 20 మండల కేంద్రంలోని శ్రీ శ్రీనివాస భారత్ గ్యాస్ ఏజెన్సీ పై వినియోగదారుల నుంచి వరుసగా వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.గ్యాస్ సిలిండర్లు సమయానికి అందకపోవడం, బుకింగ్ చేసినప్పటికీ రోజులు గడిచినా సరఫరా జరగకపోవడం, కొంతమంది వినియోగదారులకు అధిక ధరలకు బ్లాక్‌లో సిలిండర్లు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.జిల్లా పౌర సరఫరా అధికారి డి. అంకయ్య, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహశీల్దారు ఎస్. చంద్రశేఖర్‌రావు...