ఎల్‌నినో ప్రభావంతో పోలవరం జిల్లాలో వర్షపాతం లోటు

అత్యవసర సమాచారం కోసం జిల్లా కంట్రోల్ రూం ఏర్పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ కె. దినేష్ కుమార్ రంపచోడవరం, మే 21 (పెన్ పవర్): ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పులు మరియు అధిక ఉష్ణోగ్రతల కారణంగా పోలవరం జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే గణనీయంగా తక్కువ వర్షపాతం నమోదవుతోందని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఏర్పడుతున్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు జిల్లా...