ఏడువారాల వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

  కోనసీమ తిరుమల వాడపల్లిలో గోవింద నామస్మరణతో మారుమోగిన మాడవీధులు ఆత్రేయపురం పెన్ పవర్ మే 16 కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం శనివారం భక్తజన సందోహంతో కళకళలాడింది. అమావాస్య శనివారం కావడంతో తెల్లవారుజామున నుంచే వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ముఖ్యంగా ఏడువారాల నోము చేసుకునే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆలయ మాడవీధుల్లో ఏడు ప్రదక్షిణాలు నిర్వహిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. వేకువజామున మేలుకొలుపు...