కాటన్ దొర ఆశయాలను జీవితాంతం చాటిన డేగల సత్యనారాయణకు ఘన నివాళులు

కాజులూరు మండలంలో సర్ ఆర్థర్ కాటన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ కాజులూరు, పెన్‌పవర్‌, మే 15ః కాజులూరు మండల పరిధిలోని డేగలపేట గ్రామానికి చెందిన కీర్తిశేషులు డేగల సత్యనారాయణ సర్ ఆర్థర్ కాటన్ దొరపై అపారమైన అభిమానం కలిగిన వ్యక్తిగా గ్రామ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అపర భగీరథుడిగా పేరుగాంచిన సర్ ఆర్థర్ కాటన్ జయంతిని ప్రతి ఏడాది అత్యంత భక్తి, గౌరవాలతో నిర్వహించడం ఆయన జీవితంలో ఓ నియమంగా కొనసాగింది. గోదావరి జిల్లాలను అన్నపూర్ణగా మార్చిన మహనీయుడు కాటన్ దొర...